Thursday, November 09, 2006

I am delighted (and a bit busy..)

ఈ రోజు నాకు చాల సంతోషంగా ఉంది. కావలసినంత తెలుగును చదివాను. కొన్ని రోజుల నుంచి నేను అనుకుంటున్నా నాకేమీ పని లేదు, లైఫ్ బోర్ కొడుతుందని. కాని నిన్నటి నుంచి నేను చాల బిజి. కారణం ఏంటో తెలుసా? చాల మంది తెలుగు బ్లగర్స్ వున్నారని తెలుసుకుని, వాళ్ళ బ్లాగులు చదవటం మొదలుపెట్టా. ఇంకా చదువుతూనే వున్నా.

అసలు నాకు తెలుగు ఎందుకు చదవాలని అనిపించింది అంటే, చాలా రోజుల తర్వాత నేను తెలుగులో ఉత్తరం వ్రాయల్సి వచ్చింది, మా మామయ్యకు. ఉత్తరమే ఎందుకు, ఫోన్ చెయ్యోచ్చుగా అనుకుంటున్నరా? ఒక చెక్కు పంపాల్సివచ్చింది. ఉత్త చెక్కును కవర్ లొ పెట్టి పంపలేముగా, దాంతో ఏవో కొన్ని మాటలు రాద్దామని పేపర్ తీసుకున్నా. అంతే! నాకు తెలుగు రాయటం రావట్లేదు. ఎంత ట్రై చేసినా ఇంగ్లీషులోనే పదాలు వస్తున్నాయి. చివరికి నాలుగు ముక్కలు రాసి పోస్ట్ చేసా. ఇంక అప్పుడు నిర్ణయింఛుకున్నా నేను నా తెలుగు ప్రతిభను తిరిగి తెచ్చుకోవాలని. (నా తెలుగు రైటింగ్ చాలా బాగుండేది, కాని ఈ ఇంజనీరింగ్ చదువులు చదివి అంతా మర్చిపోయా.)

వర్తమానంలోకి వస్తే, ఇప్పటి వరకు నేను కొన్ని తెలుగు బ్లాగులు మాత్రమే చదివాను. వాటిలో శోధన, చదువరి, గడ్డిపూలు, స్వాతి కుమారి, క్రిష్ణదేవరాయలు, స్నేహమా, మరి ముఖ్యంగా వీవెన్. ఇంకా నేను చదవ వలసిన బ్లాగులు చాలా వున్నై. వాటిని రేపటికి వాయిదా వేస్తూ....

- ఉమా..

5 comments:

Anonymous said...

మంచి నిర్ణయం తీసుకున్నారు. తెలుగు బ్లాగ్లోకానికి స్వాగతం

uma said...

@ravi,

thanks.

Vikram said...

Hey Uma...

Nice post but the font of your post is not as clear the comment above. BTW can you also help me out to be able to blog in telugu ??? Would really appreciate it.

uma said...

@ vikram,

blogging in telugu is very simple. only thing is ur browser shd support unicode format. i think IE, Firefox, Opera and Flock, as i have tested, shd support these fonts both on win and linux platforms.
just login to lekhini and u can start typing telugu in english as do in orkut. Associated scrpt will automatically display it in telugu.

రానారె said...

టపాసులు కాల్చకూడదన్న మీ నిర్ణయం గొప్పది.
నాలా ఆలోచించే మీలాంటి వారుండటం ఆనందంగావుంది.
మీ బాధ, సంతోషం, భయం, కోపం ఇలా ఏదైనా మీరూ రాస్తుండండి.

Post a Comment

Drop your message here to get in touch with me